బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా ఈ నెల 26 నుంచి బాక్సింగ్ డే టెస్ట్‌లో తలపడనున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించి తొలి రోజు టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఎంసీజీ మైదానంలో 90 వేల మంది ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్ వీక్షించే కెపాసిటీ ఉంది.