AP: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ‘పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే మా లక్ష్యం. ఇళ్లు లేని పేదలకు ఐదేళ్లలో ఇళ్లు నిర్మిస్తాం. గ్రామీణ పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తాం. ఉగాది రోజున పీ-4 విధానాన్ని ఆవిష్కరిస్తాం' అని వెల్లడించారు. అలాగే గత ప్రభుత్వంలో రంగుల పిచ్చి ఎక్కువయ్యింది.. సర్వే రాళ్లపైనా బొమ్మలు వేసుకున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.