AP: ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాము కాదని.. అది ప్రజలే ఇవ్వాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. "వైసీపీ హయాంలో జరిగిన కౌరవసభను.. గౌరవసభగా చేశాకే అసెంబ్లీలో మళ్ళీ అడుగుపెడతానని శపథం చేశా. గౌరవసభను అవమానించే పార్టీ ఇవాళ అసెంబ్లీలో లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం ఎప్పుడూ చూడలేదు. సంప్రదాయాలను మరిచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా?" అని అన్నారు.