కుక్కల దాడిలో బాలుడి మృతి

66చూసినవారు
కుక్కల దాడిలో బాలుడి మృతి
కుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణలోని చిల్పూర్ మండల పరిధి ఫతేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. లునావత్‌తండాకు చెందిన గూగులోత్ సరిత, మధు దంపతుల కుమారుడు చిన్న(7) తన తండ్రి వాగు వైపు వెళ్లాడని తెలిసి వాగులోకి వెళ్లాడు. అక్కడ తండ్రి కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వస్తుండగా.. కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్