శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాతాళగంగలో స్నానం చేసి స్వామి, అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. రాత్రి 7 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు నంది వాహనసేవ, అభిషేకం జరపనున్నారు. రాత్రి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఆలయానికి పాగాలంకరణ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవం, కల్యాణం జరగనుంది.