రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రూ.100, రూ.200 నోట్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియమితులైన నేపథ్యంలో ఆయన సంతకంతో ఈ కొత్త నోట్లు రానున్నాయి. కొత్త నోట్లు మహాత్మా గాంధీ సిరీస్‌లో ఉంటాయని ఆర్‌బిఐ తెలిపింది. వీటిని అందుబాటులోకి తెచ్చిన తర్వాత కూడా పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని వెల్లడించారు.