BREAKING: రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం

58చూసినవారు
BREAKING: రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం
పారిస్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌పై ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (IOA) క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఆమెపై మూడేళ్ల నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. తన సోదరిని ఒలింపిక్‌ గేమ్స్‌ విలేజ్‌లోకి పంఘాల్‌ తన అక్రిడిటేషన్‌తో పంపించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన IOA ఇప్పటికే ఆమె అక్రిడిటేషన్‌ను రద్దు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. తాజాగా ఆమెపై నిషేధం విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్