క్షణాల్లో కుప్పకూలిన బ్రిడ్జి (వీడియో)

57చూసినవారు
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ కంటైనర్ షిప్ ఢీకొనడంతో బాల్టిమోర్ కీ బ్రిడ్జి కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్న కార్లు, ఇతర వాహనాలు పటాప్స్కో నదిలో పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే బ్రిడ్జికి ఇరువైపులా వాహనాల రాకపోకలను అధికారులు నిలిపి వేశారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం సహాయక చర్యలు ప్రారంభించారు. బ్రిడ్జి కూలిపోతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్