అక్రమ వలసలకు చెక్‌.. సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్‌

71చూసినవారు
అక్రమ వలసలకు చెక్‌.. సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్‌
అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్‌ వాటిని ఆపేందుకు సంచలన బిల్లు తీసుకువచ్చింది. మంగళవారం ‘సేఫ్టీ ఆఫ్‌ రువాండా’ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. బ్రిటిష్ రాజు చార్లెస్ III ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారింది. బ్రిటన్‌కు వస్తున్న అక్రమ వలసదారులను అడ్డుకునేందుకే రువాండా బిల్లును తీసుకొచ్చామని ప్రధాని రిషి సునక్ అన్నారు.

సంబంధిత పోస్ట్