సోదరులను బందీ చేసి దారుణంగా కొట్టారు (వీడియో)

241072చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన ఘటన మరవకముందే మరో దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండోర్‌లో గిరిజనులపై అవమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఇద్దరు గిరిజన సోదరులను బందీ చేసి దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే గ్వాలియర్‌లో నడుస్తున్న ఒక కారులో ఓ యువకుడిని మరో వ్యక్తి పాదాలు నాకించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్