CM రేవంత్ రెడ్డిపై BRS ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం

559చూసినవారు
CM రేవంత్ రెడ్డిపై BRS ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. కేటీఆర్ భాష మార్చుకోవాలని కాంగ్రెస్ వాళ్లు అంటుంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భాష సరిదిద్దుకోవాలని భట్టి ఏ రోజైనా సూచించారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నీచంగా, ఘోరంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను భట్టికి గుర్తు చేస్తున్నానని తెలిపారు. అవసరమైతే సీఎంకి భట్టి శిక్షణ తరగతులు నిర్వహించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్