ఘనాకు చెందిన ఒక బుడతడు ఏడాది వయసుకే గిన్నీస్ బుక్ రికార్డు పట్టేశాడు. ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన పురుష చిత్రకారుడిగా ఏస్ లియామ్ ననా శామ్ ఘనత సాధించాడు. అతడి రికార్డును గిన్నిస్ బుక్ అధికారికంగా ప్రకటించింది. అందులో అర్హత సాధించడానికి అక్కోరాలోని మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నిర్వహించే ప్రొఫెషనల్ ఎగ్జిబిషన్‌లో శామ్ పాల్గొన్నాడు. అక్కడ అతని 10 పెయింటింగ్‌లలో 9 అమ్ముడుపోయాయి.