ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య దూరం పెరిగిపోవడంతో నేడు గవర్నర్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే గవర్నర్ ప్రసంగం ముగిసింది. అనంతరం జరిగే బీఏసీ మీటింగ్ కూడా ముగిసింది. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ప్రభుత్వం ఈనెల 6న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 8వ తేదీన బడ్జెట్ పద్దులపై చర్చ జరపనున్నారు. అదేరోజు మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి, తదుపరి షెడ్యూల్ పై చర్చించనున్నారు.