TG: భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడని వైద్యులు తెలిపారు. మరో వ్యక్తి ఉపేందర్ శిథిలాల కింద చిక్కుకున్నాడు. శిథిలాలకింద ఎంత మంది ఉన్నారో తెలియరాలేదు.