బంగ్లాదేశ్‌లో నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం రేపు కొలువుతీరనుంది. ఇప్పటివరకు ప్యారిస్‌లో ఉన్న యూనుస్ బంగ్లాదేశ్‌కు బయలుదేరే ముందు బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను మా దేశానికి బయలుదేరుతున్నాను. బంగ్లాదేశ్‌ను సమస్యల నుంచి గట్టెక్కించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. ‘హింసతో మనం ఏదీ సాధించలేం. హింసా మార్గంలో పయనిస్తే అన్నీ నాశనం అవుతాయి. శాంతి మార్గంలోనే మనం అభివృద్ధిని సాధించగలం’ అని తెలిపారు.