డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ

53చూసినవారు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ
బంజారాహిల్స్ రోడ్ నంబర్14లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జ‌రిగింది. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బిహార్‌కి చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. నిందితుల నుంచి రూ.2.2 లక్షల నగదు, 100 గ్రాముల‌ బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇంట్లో పని చేసే వ్యక్తులే చోరీకి పాల్పడిన‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్