నడి రోడ్డుపై తగలబడిన కారు (వీడియో)

559చూసినవారు
ఏపీలోని విశాఖపట్నంలో నడిరోడ్డుపై ఓ టాటా ఇండిగో కారు కాలిపోయింది. ఇవాళ మధ్యాహ్నం గోపాలపట్నంలో పెట్రోల్ బంక్ కూడలిలో రోడ్డుపై వెళుతున్న కారులో మంటలు వ్యాపించాయి. బ్యాటరీ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉండటంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. కాగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్