మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఓ బస్సు మంటలకు ఆహూతైంది. దూలే జిల్లా పరిధిలో అకోలా-షహదా రోడ్డుపై ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సు మొత్తం కాలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.