హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో మంగళవారం ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.