నేపాల్‌లోని మదన్-ఆష్రిత్ హైవేపై తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు అదుపుతప్పి త్రిశూలి నదిలోకి దూసుకెళ్లాయి. ఆ బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వారి పనులకు ఆటంకం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు.