సీతాఫలం అందరికీ పడదు. ఈ పండు తినడం వల్ల కొందరికి అలర్జీ వస్తుంది, దురదతో బాధపడవచ్చు. ఒంటిపై దద్దుర్లు వస్తాయి. సీతాఫలంలో సిట్ఫాల్ అనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఈ పండ్లు ఎక్కువగా తిన్నప్పుడు కొందరికి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. సీతాఫలంలో అనోనాసిన్ అనే టాక్సిన్ కారణంగా నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు సీతాఫలం తినకపోవడమే మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.