అధిక చక్కెర ఉన్న ఆహార పదార్థాలు తినడం మానేయడం వల్ల గణనీయంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చక్కెర ఉన్న ఆహారాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన బరువు పెరుగుతారు. ఇవి అతిగా తినడానికి దారి తీస్తాయి. చక్కెర తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థిరంగా ఉంటుంది. మొటిమలు, రోసేసియా వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది. డయాబెటీస్ వంటి సమస్యలు దరిచేరవు.