AP: ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. బ్యారేజీ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరులశాఖ అధికారులు వారికి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ENC వెంకటేశ్వర్లు కేంద్రబృందానికి అందజేశారు. ఈ నెల 1న రికార్డు స్థాయిలో 11.43లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపునకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం దృష్టికి ఆయన తీసుకెళ్లారు.