జులై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ?

78చూసినవారు
జులై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జులై మొదటి వారంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం. సుదర్శన్ రెడ్డి, మదన్‌మోహన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, రామ్మోహన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్