DLS సహ రూపకర్త డక్‌వర్త్ మృతి

51చూసినవారు
DLS సహ రూపకర్త డక్‌వర్త్ మృతి
డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ విధానాన్ని కనిపెట్టినవారిలో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్(84) మరణించారు. ఆయన ఈ నెల 21న కన్నుమూశారని క్రిక్ఇన్ఫో వెబ్సైట్ తెలిపింది. వర్షంతో ప్రభావితమయ్యే క్రికెట్ మ్యాచుల్లో ఫలితాలను రాబట్టేందుకు, కుదించాల్సిన ఓవర్లను, ఛేదించాల్సిన లక్ష్యాలను అంచనా వేసేందుకు టోనీ లూయిస్ తో కలిసి ఆయన ఈ విధానాన్ని కనిపెట్టారు. లూయిస్ 2020లో చనిపోయారు. 1997 నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో DLSను వాడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్