పార్క్ చేస్తున్న ఓ కారు.. పై అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహరాష్ట్రలోని పూణెలో శుభ్ గేట్‌వే అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కారును రివర్స్‌లో పార్క్ చేస్తుండగా పిట్టగోడను ఢీకొట్టి కిందకు పడిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి కారులోని వారిని రక్షించారు. కారు మాత్రం డ్యామేజ్ అయింది.