మహారాష్ట్ర హింగోలి జిల్లాలోని వస్మత్ పట్టణంలో ఆదివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. కారు అదుపు తప్పి బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. వారిలో ఒకరు రోడ్డుపై పడిపోగా, బాధితుడిని తొక్కుకుంటూ కారు డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కొన్ని దుకాణాలు సైతం ధ్వంసం అయ్యాయి. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.