AP: భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌పై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించారని రామచంద్రయాదవ్‌పై కేసు నమోదు చేశారు. శ్రీవారి ఆలయం వద్ద సాధువులతో రామచంద్రయాదవ్ ధర్నా చేశారు. దీంతో, బీసీవై పార్టీ అధినేతతో సహా 19 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై పూర్తిసమాచారం తెలియాల్సి ఉంది.