తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. మండుటెండలో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. భానుడు రోజురోజుకు నిప్పుల వర్షం కురిపించడంతో ఇప్పుడే 37నుంచి 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండవేడిమిని తట్టుకోలేక రోజువారి కూలీలు, రైతులు, ఉపాధి కూలీలు చిన్న పిల్లలు, వృద్దులు, రోగులు అల్లాడుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే ఎప్రిల్, మే నెలల్లో ఎండ ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు.