క్యాచ్ వివాదం.. బౌండరీ లైన్‌ని వెనక్కు నెట్టారా!

63చూసినవారు
క్యాచ్ వివాదం.. బౌండరీ లైన్‌ని వెనక్కు నెట్టారా!
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ పట్టిన సెన్సేషన్ క్యాచ్‌పై తీవ్ర వివాదం నెలకొంది. సౌతాఫ్రికా ఫ్యాన్స్ దీనిపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. నిజానికి అది సిక్స్ అని, కానీ బౌండరీ లైన్‌ను వెనక్కు నెట్టారని చెప్తున్నారు. తాజాగా ఈ విమర్శలను తిప్పికొడుతూ.. ఓ క్రికెట్ విశ్లేషకుడు అసలు నిజం బయటపెట్టాడు. ఆ బౌండరీ లైన్‌ను ఏమాత్రం వెనక్కు జరపలేదని, మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు నుంచే అది అక్కడే ఉందని క్లారిటీ ఇచ్చాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్