పోలవరం సత్వర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరోసారి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12వేల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. విద్యా రంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.