వికారాబాద్ జిల్లాలోని దామగుండం ఫారెస్ట్‌లో 2900 ఎకరాల్లో నేవీ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. సముద్ర మట్టానికి 350 మీటర్ల ఎత్తులో ఉండటంతో సిగ్నల్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు నేవీ అధికారులు వెల్లడించారు. రాడార్ ఏర్పాటుతో ఈ ప్రాంత పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.