AP: ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి, నిర్మాత నాగ వంశీ, ఏపీ మంత్రి అంగని సత్య ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారిని స్వాగతించి దర్శన ఏర్పాట్లు చేశారు. తరువాత, పండితులు రంగనాయకుల మండపంలో వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.