బీజేపీ అంటేనే విరుచుకుపడే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ నేత అయిన నితీన్ గడ్కరీపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢిల్లీ మాజీ సీఎం పలు కీలక విషయాలపై చర్చించారు. బీజేపీకి చెందిన ఏ నాయకుడు బాగా పని చేస్తారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా..‘నాకు నితిన్ గడ్కరీ అంటే ఇష్టం. ఆయన బాగా పని చేస్తారు. దేశంలో ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారు’ అని సమాధానమిచ్చారు.