ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఇంగ్లండ్ విధించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 5వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ 351/8 స్కోర్ ఈ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కాగా.. ఈ లక్ష్యాన్ని ఆసీస్ 47.3 ఓవర్లలో ఛేదించింది. జోష్ ఇంగ్లిస్ (120*) సెంచరీ, అలెక్స్ కేరీ (69), మాథ్యూ షార్ట్ (63) హాఫ్ సెంచరీ, లబుషేన్ (47) కీలక ఇన్నింగ్స్ తోడవడంతో స్మిత్ సేన విజయం సాదించింది.