భారత్ పంపిన చంద్రయాన్-3 మిషన్.. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో 250కి పైగా ప్రకంపనలకు సంబంధించిన సంకేతాలను నమోదు చేసిందని పలు నివేదికలు తెలిపాయి. వీటిల్లో దాదాపు 200 సంకేతాలు ప్రజ్ఞాన్ రోవర్ కదలికలు లేదా శాస్త్రీయ పరికరాల కార్యకలాపాలకు సంబంధించినవి. కాగా, మిగిలిన 50 ప్రకంపనలు ఏంటనేది తెలియరాలేదని, మూన్‌క్వేక్‌లతో సంబంధం ఏమైనా ఉందా అనేదానిపై అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.