సైబర్ ముఠాలు టెలిగ్రామ్ గ్రూపు ద్వారా భారతీయులను సంప్రదిస్తూ సిమ్‌కార్డులు కొంటున్నారు. ఇక్కడ యాక్టివేట్ చేసిన సిమ్‌కార్డులను విదేశాలకు తరలించి డొల్లకంపెనీల బ్యాంకుఖాతాలతో లింక్‌చేస్తున్నారు. కాజేసిన సొమ్మును బదిలీ చేసేందుకు వాటిని వినియోస్తున్నారు. ఐటీశాఖకు అనుమానం రాకుండా ఒక్కో దఫాలో రూ.5 లక్షల్లోపు మాత్రమే బదిలీచేస్తున్నారు. అనంతరం క్రిప్టోకరెన్సీ రూపంలోకి మార్చి విదేశాలకు తరలిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని 6 ఖాతాల ద్వారా రూ.175 కోట్లు తరలించారు.