పెట్టుబడులకు భారీమొత్తంలో లాభాలిప్పించేలా మెలకువలు నేర్పిస్తామంటూ.. ప్రత్యేక కోటా కింద ఐపీవో షేర్లు దక్కేలా చేస్తామంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, టెలిగ్రామ్ ద్వారా సందేశాలు పంపిస్తారు. నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని లింక్‌లు పంపిస్తారు. ఆ సమయంలో వాట్సాప్ ద్వారా ఏపీకేఫైల్స్ పంపిస్తారు. పెట్టుబడులకు లాభాలొచ్చాయంటూ బాధితుల్ని నమ్మిస్తారు. లాభాలు కనిపించేలా డ్యాష్‌బోర్డుల్లో చూపెడతారు. తీసుకోవాలంటే కస్టమర్ కేర్‌ను సంప్రదించాలనే సందేశం కనిపిస్తుంది.