పారిజాతం మొక్కతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పారిజాతం పూలను నీళ్లలో వేసి బాగా ఉడకబెట్టాలి. ఆ తర్వాత మరిగిన నీటిని వడకట్టి రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇంకా పారిజాతం మొక్క కొమ్మని ఎండబెట్టి, పొడి చేసుకొని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ మొక్క ఆకులు, పూలతో టీ చేసుకొని, తేనె కలుపుకొని తాగితే సీజనల్ వ్యాధులు దూరమవుతాయి.