మహారాష్ట్రలో బెలూన్ నోట్లో పేలిపోవడం వల్ల ఓ 8 ఏళ్ల బాలిక మరణించింది. ధూలే నగరంలోని యశ్వంత్ నగర్లో 8 ఏళ్ల బాలిక సరదాగా బెలూన్ ఊదుతుండగా అది పేలి, ఒక ముక్క గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక మరణించింది. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. బాలిక స్పృహతప్పిపడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.