ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చి మూడు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బాలాపూర్(ఖుర్దు)లో జరిగింది. వారం రోజులుగా ఓ చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఆరుగురు వ్యక్తులపై దాడిచేయగా, ఒకరు మృతిచెందారు. అంతేకాదు ఆ చిరుత పలు జంతువులపై కూడా దాడిచేసింది. ఈక్రమంలో గ్రామ పొలిమేరలో రైతు డిమ్‌దేవ్ సలోటేకు చెందిన పశువుల పాకలోకి వెళ్లిన చిరుత సోమవారం ఉదయం మూడు పిల్లలను ప్రసవించింది.