అపార్ట్‌మెంట్ లోకి దూరిన చిరుత.. వీడియో

3291చూసినవారు
హర్యానాలోని గురుగ్రామ్‌లో చిరుత అపార్ట్‌మెంట్ లోకి చొరబడింది. నర్సింగాపూర్ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఓ అపార్ట్‌మెంట్ లోకి వెళ్ళింది. కాసేపటికే చిరుత కిందికి రావడం అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న అటవీ, పోలీసు అధికారులు వలలతో ఘటనా స్థలానికి చేరుకుని దానిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు. చిరుతను చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్