ధోని రిటైర్‌మెంట్‌పై చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు

555చూసినవారు
ధోని రిటైర్‌మెంట్‌పై చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు
మిస్టర్ కూల్, తలా ధోని భవితవ్యంపై సీఎస్కే బౌలింగ్‌ కోచ్ ఎరిక్ సైమన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2010 నుంచి ధోనీతో పరిచయం ఉందని.. గేమ్‌ను అర్థం చేసుకోవడంలో అతడిని మించిన వారెవరూ లేరని తెలిపాడు. ప్రతి మ్యాచ్‌ సమయంలోనూ ధోనీ భవితవ్యంపై చర్చ కొనసాగుతోంది. వినడానికి చాలా క్రేజీ ఉంటుంది. ఎంఎస్‌డీకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. అతడు తన భవిష్యత్తుపై పూర్తి అవగాహనతో ఉంటాడు. తప్పకుండా నిర్ణయం తీసుకుంటాడు అని ఎరిక్‌ వెల్లడించాడు.

సంబంధిత పోస్ట్