ఫైనల్ కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్

12330చూసినవారు
ఫైనల్ కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్‌ 14వ సీజన్‌ లో భాగంగా ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ పై విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. పృథ్వీ షా 60, రిషభ్‌ పంత్‌ 51* పరుగులు చేసి రాణించారు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి173 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ 70, రాబిన్‌ ఉతప్ప 63 పరుగులతో రాణించారు. చివర్లో ధోని 18* చెన్నైను విజయతీరానికి చేర్చాడు. దీంతో చెన్నై ఫైనల్ కు చేరుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ గత సీజన్‌లాగే తొలి క్వాలిఫయర్‌లో ఓడి ఫైనల్లో బెర్త్‌ కోసం రెండో క్వాలిఫయర్‌ ఆడేందుకు సిద్ధమైంది.

సంబంధిత పోస్ట్