ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయినప్పటకీ పృథ్వీ షా ఫోర్లు, సిక్సర్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్‌లతో 60 పరుగులు సాధించాడు. పృథ్వీ ఔటయ్యాక రిషబ్ పంత్(50), షిమ్రాన్ హెట్‌మైర్(37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో జోష్ హాజెల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో చెరో వికెట్ సాధించారు. సీఎస్‌కే జరగుతున్న మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న పృథ్వీ షా వికెట్‌ను ఢిల్లీ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పృథ్వీ షా, డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్‌లతో 60 పరుగులు సాధించాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.