మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సతీమణి
ఉపాసన ముంబయిలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని మహాలక్ష్మీ దేవాలయానికి కూతురు క్లింకారాను తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అయితే, కెమెరాలకు మెగా ప్రిన్సెస్ క్లింకారా ముఖం కనిపించకుండా
ఉపాసన జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.