AP: సీఎం చంద్రబాబు రేపు (మార్చ్ 1) చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జీడీ నెల్లూరులోని రామానాయుడు పల్లెకు చేరుకోనున్నారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు సీఎం అందివ్వనున్నారు. అలాగే, పది సూత్రాల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించనున్నారు. ఇక, ప్రజా వేదిక సభ నుంచి స్థానిక ప్రజల్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.