బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా

70చూసినవారు
బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా
బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ శనివారం రాజీనామా చేశారు. ఆయన మాజీ ప్రధాని షేక్ హసీనాకు విధేయుడిగా ఆందోళనకారులు ఆరోపించారు. రాజధాని ఢాకాలోని కోర్టు వెలుపల వేలాదిగా నిరసనకారులు గుమిగూడారు. రాజీనామా చేయాలని ఒబైదుల్ హసన్‌కు అల్టిమేటం ఇచ్చారు. లేకుంటే న్యాయమూర్తుల నివాసాలను ముట్టడిస్తామని ఆందోళన చేస్తున్న విద్యార్థులు హెచ్చరించారు. దీంతో రాజీనామా చేస్తూ ఒబైదుల్ హసన్ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్