రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో బోరు బావిలో పడిపోయిన చిన్నారి చేతనను ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీశారు. గతేడాది డిసెంబర్ 23న 150 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయిన చిన్నారి దాదాపు 10 రోజుల రెస్క్యూ తర్వాత సజీవంగా బయటకు తీసుకొచ్చినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.