AP: రాష్ట్రాల్లో జాతీయ పింఛన్ విధానంపై ఈ నెల 16న ఢిల్లీలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. పింఛన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ నేతృత్వంలో ఎన్పీఎస్ విధానంపై సదస్సు జరగనుంది. సదస్సుకు ఏపీ తరఫున ముగ్గురు అధికారులను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి గౌతమ్ అల్లాడ, డిప్యూటీ సెక్రటరీ నూరల్ ఖమర్, ట్రెజరీ విభాగం జేడీ శ్రీనివాసనాయక్ పేర్లు ఇందులో ఉన్నాయి.